కనీసం రోడ్లు కన్నాలు కూడా పూడ్చలేని చేతగాని ఎమ్మెల్యే
తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఎద్దేవా
నాతవరం మండలంలో శనివారం ఎన్నికల శంఖారావం పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ అయ్యన్న మంత్రిగా సుమారుగా ఐదు కోట్ల 33 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు కోట్లు సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత అయ్యన్నదే అన్నారు.
వెదురుపల్లి గ్రామమైన బొడ్డు నాయుడు గారి కుటుంబమైన అయ్యన్నపాత్రుడు కి ఎనలేని అభిమానమని ఈ గ్రామం చింతపల్లి నియోజకవర్గం లో ఉన్నప్పుడు కూడా అయ్యన్నపాత్రుడు గారి చేతనే పనులు చేయించుకునే వారని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా నేనుంటానని ఎవరైనా బెదిరించిన భయపడే ప్రసక్తే లేదని 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని అరాచకాలకు పాల్పడిన వ్యక్తులను చట్టపరంగా శిక్ష ఉంటుందని వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి ప్రచారం చేసిన ఎవరినైనా బెదిరించిన చర్యలు ఎలక్షన్ కమిషనర్ తీసుకుంటారని రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ దేనికి పనిచేయకుండా మీ భవిష్యత్తు నాశనం అవుతుందని జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు జీతం పెంచి మంచి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని రానున్న ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు కి సైకిల్ గుర్తుపై పార్లమెంట్ బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీ నేతల విజయ్ కుమార్ తెలుగుదేశం నాయకురాలు పారుపల్లి వెంకటరమణి బిసి సెల్ అధ్యక్షులు పారుపల్లి వెంకటరమణ గ్రామ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి దివాణం ప్రొఫెషనల్ అధ్యక్షుడు పొలుపర్తి రాజు ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య ఎస్ బి పట్నం సర్పంచ్ లోకవరపు సతీష్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు