అనంతపురం జిల్లా తాడిపత్రి లో రూ.1.31 కోట్ల నగదు సీజ్

 అనంతపురం టీవీ సెవెన్ న్యూస్


 ఎటువంటిఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.31 కోట్ల నగదును సీజ్ చేసినట్లు తాడి పత్రి డిఎస్పీ గంగయ్య తెలిపారు  జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు తాడిపత్రి డీఎస్పీతో కలిసి సెట్ అదనపు ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు.  కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బు తరలి స్తున్నారనే సమాచార మేరకు సి.ఐ లు మురళీకృష్ణ, లక్ష్మికాంతరెడ్డిల ఆధ్వ ర్యంలో పోలీసులు, ప్రత్యేకబృందాలతో తనిఖీలు చేపట్టామన్నారు. తాడిపత్రి బస్టాండు వద్ద రూ .131,35,750 లునగదును అక్రమంగా తరలిస్తున్న తాడిపత్రి పట్టణం మెయిన్ రోడ్డుకు చెందిన షేక్ మస్తాన్ వలి, షేక్ నజీమున్నీసా, షేక్ రషీద్లలను అదువులోకి తీసుకొని వారి నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.

1.31 కోట్లు నగదును సీజ్ చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఈ ముగ్గురిని అరెస్టు చేసి, ఐ.టి విభాగానికి ఈ నగదు అప్పగించి నట్లు తెలిపారు. షేక్ మస్తాన్ వలీ ఇంట్లో ఐ.టి విభాగం ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారని, ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు, కేరళ, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలలో బంగారు కొనుగోలు చేసి తాడిపత్రిలో అధిక ధరలకు విక్రయిస్తుంటారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేశామన్నారు.