కొయ్యూరు టీవీ సెవెన్ న్యూస్
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చీడీ పాలెం గ్రామం వద్ద 554 కిలోల గంజాయి తరలిస్తున్న జీపును,రెండు ద్విచక్ర వాహనాలను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు కొయ్యూరు సీఎం వెంకటరమణ విలేకరులకు తెలిపారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ, మంప ఎస్ఐ లోకేష్ కుమారులు తమ సిబ్బందితో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న జీపులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా బారిఎత్తున గంజాయి బయటపడిందన్నారు. అన్నవరం గ్రామానికి చెందిన సిందారి సూరిబాబు, కొత్తవాడ గ్రామానికి చెందిన పాంగీ ప్రసాద్, అదే గ్రామానికి చెందిన వంతల శివయ్య, కొర్ర గిరి, పాంగి శాదు ,బూరుకు పాలెం కిలో బాలరాజు, కోరుకొండ గ్రామానికి చెందిన రీమల ప్రశాంత్ లుగా పోలీసులు గుర్తించారు. గతంలో పలు పర్యాయములు గంజాయి కేసులలో శిక్షణ అనుభవించి మరల అక్రమ గంజాయి తరలింపుకి పాల్పడుతున్నారని, వీరి పై గంజాయిష్మగులర్లుగా కేసులు నమోదు చేసి నట్లు సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని, ప్రభుత్వం అందజేస్తున్న అనేక పథకాల ద్వారా జీవనోపాధి పొందాలని సి ఐ హితం అలికారు.