ఆంద్రా-ఛత్తీసఘడ్ సరిహద్దుల్లో బీజాపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందగా, సంఘటనా స్తలం నుంచి భారీ ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం సరిహద్దుల్లో బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్టేషన్ పరిధిలో మావోయిస్టులు కదలికలపై కోబ్రా,బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు సోమవారం రాత్రి గాలింపుకు వెళ్లారు. పోర్చలి అటవీప్రాంతంలో మావోయిస్టులు తారసపడటంతో పోలీసులకు మావోయిస్టులకు మద్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో తొమ్మది మంది మావోయిస్టులు మృతి చెందగా, సంఘటనా స్థలంలో ఒక ఏకే 47, లైట్ మెషిన్ గన్, ఆటోమెటిక్ గన్‌తో బాటు భారీ ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇంకను పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పోలీసులు పూర్తి వివరాలు దృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికి తొమ్మిది మంది మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు అనాధికారిక సమాచారం