తాండవాలో బోటు బోల్తా ఒకరు గల్లంతు

గొలుగొండ మండలంలో చాలిక మల్లవరం గ్రామానికి చెందిన జన్ని పోతురాజు, గరగల అప్పారావులు కలిసి తాండవ రిజర్వాయర్ లో రాత్రి చేపల వేటకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో అగస్మాత్తుగా బోటు తిరగబడ్డంతో ఇద్దరు నీట మునిగడంతో కేకలు వేశారు.


ఇదే సమయంలో సమీపంలో వేట చేస్తున్న మత్స్యకారులు పోతురాజును రక్షించారు. గరగల అప్పారావు ఆచూకీ కనిపించలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.