కాఫీ,మిరియాల తోటలు దగ్దం

అరకువేలి టీవీ సెవెన్ న్యూస్

బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి

కోడిపుంజు వలస రైతులు ఆవేదన

అరకువేలి  మండలంలోని శిరగం పంచాయతీ కోడిపుంజు వలస గ్రామానికి చెందిన కాపీ మిరియాలు తోటలను మంగల వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి దగ్దం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు హుటాహుటిన కాపీ మిరియాల తోటలకు వెళ్లి మంటలను ఆర్పడానికి నానా అవస్థలు పడ్డారు.ఎంతో శ్రమించి మంటల్ని ఆర్పిన మంటలు వేగంగా వ్యాపించడంతో తోటలు పూర్తిగా కాలీ బుడిద అయ్యాయని రైతులు జన్ని సోమన్న,జన్ని అప్పన్న, పూజారి గుండు,కొర్ర సుబ్బారావు,లబోదిబోమంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.ఎవరో కావాలని తోటలకు నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నో ఏళ్లు గా ఎంతో కష్టపడి శ్రమించి కాపీ మిరియాలు వేసి జాగ్రత్త గా చూసుకుంటున్నామని ఇన్నేళ్ళ శ్రమంతా వృదా అయ్యిందని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.కాఫీ మిరియాల తోటలతో ఆర్థికంగా ఒక భరోసా గా ఉండేదని ఇప్పుడు తోటలు కాలిపోవడంతో రోడ్డు న పడ్డామని భావోద్వేగానికి లోనయ్యారు.గతంలో కూడా చాలా సార్లు  తోటలకి నిప్పంటించిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని .అలాగే బాధ్యులపై విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకొవాలన్నారు.ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు.