ఒకరు మృతి అయిదుగురుకి తీవ్ర గాయాలు
హుటా హుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్న అనకాపల్లి బిజెపి అభ్యర్థి సీఎం రమేష్
కసింకోట టివి సెవెన్ న్యూస్
పెందుర్తి నుండి పిఠాపురం కారులో వెళ్తూ టిఫిన్ చేసేందుకు కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారి పక్కన టిఫిన్ బండి దగ్గర ఆగి కుటుంబ సభ్యులు మొత్తం టిఫిన్ చేస్తుండగా హఠాత్తుగా అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు వారిపై నుంచి దూసుకు వచ్చింది.
బాలుడు గౌస్ మృతి చెందగా మిగతా కుటుంబ సభ్యులు ఐదుగురికి గాయాలు అయినాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అనకాపల్లి బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హుటా హుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కోరారు .