వృధా అవుతున్న త్రాగునీరు పట్టించుకోని అధికారులు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం పెద గొలుగొండపేట గ్రామంలో మంచినీటి సరఫరా అయ్యే పైపు కన్నంపడి త్రాగునీరు వృధాగా పోతుంటే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అసలే వేసవికాలం దానికి తోడు కరెంటు సమయానికి లేకపోతే త్రాగునీరుకి చాలా ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది .అలాగని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపం పోలేదు. గుక్కెడు నీళ్లు లేక చాలా ప్రాంతాల్లో ప్రజలు అలమటిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మనకు ఉన్న వనరులను ఇలా వృధాగా వదిలేస్తే రానున్న కాలానికి మనకి కూడ నీటి కష్టాలు ఏర్పడతాయిఅనేది జెగమెరిగిన సత్యం. ఇకనైనా అధికారులు స్పందించి వృధాగా పోతున్న నీటిని అదుపు చేసి త్రాగు నీరు అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.