భూగర్భ శివాలయాన్ని దర్శించుకున్న సినీ హీరో సుమన్

నాతవరం టీవీ సెవెన్ న్యూస్


చిక్కుడుపాలెంలో 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన 

నాతవరం మండలం చిక్కుడు పాలెం గ్రామంలో వెలిసినటువంటి భూగర్భ శివాలయం దర్శించడంతోపాటు అక్కడే50 పడకల ఆస్పత్రికి సోమవారం సినీ హీరో సుమన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్త్ ఇండియా లో ఉన్న శివాలయాలు కన్నా ఈ శివాలయం చాలా బాగుంది అన్నారు అలాగే తెలుగు తమిళం కన్నడ మూడు భాషల్లో కలిపి సుమారుగా 750 సినిమాలు తీశానని అందులో బాగా పేరు తెచ్చిన గుర్తింపు ఇచ్చిన సినిమా అన్నమయ్య అని  భగవంతుడిగా నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. శివ ఆజ్ఞ ఉంటే అన్నీ వస్తాయని మనల్ని ఏదో శక్తి కాపాడుతుందని అది భగవంతుడే అని మనకి ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చిన తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని మనకి సాయం చేయడం కోసం భగవంతుడే మనుషుల రూపంలో వస్తాడన్నారు.


మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంతో గౌరవించాలని అన్నిటికన్నా కులం గొప్పదే అయిన అది ఇంటి వరకే పరిమితం చేయాలన్నారు మన అభివృద్ధిని ఎదుగుదలను స్వార్థం లేకుండా ఆకాంక్షించేది తల్లిదండ్రులు గురువులే అన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలన్నారు. 

కార్యక్రమంలో భూగర్భ శివాలయ అర్చకులు ఆలయనిర్మాణ కర్త అయినటువంటి కె ఎస్ ఆర్ శర్మ మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణానికి తన సొంత నిధులు మరియు దాతల సహాయంతో నిర్మాణం చేసేమని అలాగే గుడి నిర్మాణానికి తలదాతలు కీర్తిశేషులు రుత్తల అప్పన్న దంపతులు అని హాస్పటల్ నిర్మాణానికి స్థల దాతలు కీర్తిశేషులు సింగంపల్లి నాగరాజు సింహాచలం అని ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే తమని సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు