బటన్ నొక్కావ్ మరి నువ్వు ఎంత నొక్కావు జగన్

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


 విజయ డంకా తో యువశక్తి కార్యక్రమం

మంగళవారం సాయంత్రం నర్సీపట్నం శివారు బలిగటం నందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభి వంగవీటి రాధా హాజరై యువశక్తి కార్యక్రమంలో మాట్లాడినారు.అయ్యన్న మాట్లాడుతూ

రాష్టం లో కేవలం మన నర్సీపట్నం లో మాత్రమే యువ శక్తి ఏర్పాటు చేశాం అని యువతకు టీడీపీ పార్టీ యే గుర్తింపు తెచ్చిందని, ప్రస్తుతం సైకో ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ అని ఆ ఊసే లేకుండా చేశాడని అన్నారు పట్టాభి మాట్లాడుతూ


నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ తన జేబు నింపుకోవడం తప్ప అభివృద్ధి చేసింది లేదు అని కేవలం సెల్ఫీ కి పరిమితం తప్ప నిధులు తెచ్చిన మాట లేదు,తాండవ గేట్లు మారమత్తు చెయ్యని పిల్ల సైకో ఈ ఎమ్మెల్యే గణేష్ ,అయ్యన్నపై ఎన్ని కేసులు పెట్టినా నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని

జూన్ 4 తర్వాత అందరి సంగతి తేలుస్తాం అని అన్నారు.వంగవీటి రాధా మాటలాడుతూ 

ఒక పక్క జగన్ యాత్ర లో బటన్ నొక్కుతున్నాను అంటున్నారే మీరు ఎంత నొక్కారు అని పులులు సింహాలు కాదు రాష్టంనీ పరిపాలించడినికి  కావాల్సింది అని 


ఒక ఒక సామాన్యుడుకి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి ,అది మన అయ్యన్న మాత్రమే ,కంపెనీలు రాకపోతే మీరు అమ్మ వడి  ఇచ్చి  ఏమి సాధించడానికి అని అన్నారు.

కూటమి గెలుపు మనకి  మన రాష్టం కి చాలా అవసరo అని 

యువశక్తి ద్వారా  మన రాష్టం విజయం కోసం ముందుకు రావాలి అని పిలుపునిచ్చరు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రం నాయుడు నాయకులు పాల్గొన్నారు.