పెళ్లికి వచ్చి వధువును కిడ్నాప్ చేసే ప్రయత్నం

 తూ.గో జిల్లా : కడియం టి వి సెవెన్ న్యూస్


పెళ్లికి వచ్చి వధువును కిడ్నాప్ చేసే ప్రయత్నం

కారంచల్లి వధువును అపహరించేందుకు యత్నం

కడియంలో పెళ్లిలో వధువు కిడ్నాప్ యత్నం కలకలంరేపింది. వివాహ వేడుకలో కారం చల్లి నవవధువును ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం, గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు కలిసి నరసరావుపేటలోని ఓ కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదివారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారగా.. ఈ నెల 13న విజయవాడలోని దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు.

ఈ జంట ఆ తర్వాత కడియం వచ్చి బత్తిన వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించి, బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈ నెల 21న ముహూర్తం నిర్ణయించారు. అదే విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు తెలిపింది. కడియంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం తెల్లవారు జామున వివాహ ప్రక్రియ జరుగుతుండగా వధువు తరఫున వాళ్లు పద్మావతి, చరణ్కుమార్, చందు, నక్కా భరత్ ఒక్కసారిగా ప్రవేశించి అక్కడున్న వారిపై కారంచల్లి స్నేహను అపహరించేందుకు ప్రయత్నించారు.

వెంటనే వధువు తరఫు బంధువులు అడ్డుకున్నారు. ఈ దాడిలో బత్తిన వీరబాబుకు తీవ్రంగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ మేరకు దాడి, అపహరణ, బంగారం చోరీ తదితర ఫిర్యాదలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.