అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా వైసిపి అవకాశం ఇవ్వాలి. జున్నూరు శ్రీనివాస్

    నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


అవకాశం ఇస్తే వైఎస్ఆర్సిపి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధం అని ఐదు రూపాయలకే నర్సీపట్నంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ జానకి రామయ్య గారి కొడుకుని అని వై వి సుబ్బారెడ్డి తో మంచి సన్నిహిత సంబంధాలు  కలవు నన్ను గెలిపిస్తే అనకాపల్లి జిల్లా వాసుల రుణం తీర్చుకుంటానన్న ఇంపెండెంట్ ఎంపీ అభ్యర్థి జున్నూరి  జోసఫ్ శ్రీనివాస్.  

 వైయస్ఆర్సీపీ  అధిష్టానం అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జున్నూరి జోసెఫ్  శ్రీనివాస్ అన్నారు. కృష్ణ ప్యాలస్ లో   ఆదివారం  విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తో తనకు బాగా సాన్నిహిత్యం ఉందని, తాను అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయటానికి  ఆసక్తి ఉన్నట్టు అధిష్టానం దృష్టిలో పెట్టానన్నారు. అయితే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు  అనకాపల్లి ఎంపీ స్థానానికి నామినేషన్ వేసినప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించిన పత్రాలలో ముత్యాల నాయుడు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచలేదని, ఒకవేళ ఆ స్థానం ఏమైనా మార్పు జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టిలో ఉంచానన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు సెట్లు, వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మరొక రెండు సెట్లు నామినేషన్ పత్రాలు  జిల్లా రిటర్నింగ్  అధికారికి సమర్పించానన్నారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలవరకు సీటు విషయం తేల్చడానికి అవకాశం ఉందని, వైఎస్ఆర్సిపి నుంచి ముత్యాల నాయుడుకు సీటు రద్దు అయితే తనకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆశిస్తున్నానన్నారు. అనకాపల్లి జిల్లా సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పేదరిక నిర్మూలనకు, జిల్లా అభివృద్ధికి వంద శాతం కృషి చేస్తానన్నారు. తాను ఈ ప్రాంతం వాడినేనని, కరోనా సమయంలో ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించమన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని తన తండ్రి జానకిరామయ్య ( గొడౌన్ డాక్టర్ గా )ఐదు రూపాయలకే ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించిన డాక్టర్ గా  నర్సీపట్నం వాసులకు సుపరిచితులన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును తమకు న్యాయం చేసే వారికి వేసి గెలిపించుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం లో అందరికీ అడిగే హక్కు ఉందని  రాజకీయాల్లోకి  రావాలని తన కోరిక అన్నారు.  తనకు ఐదు భాషలు వచ్చునని తనని గెలిపిస్తే పార్లమెంట్లో జిల్లా సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అవకాశం ఇస్తే పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను కలిసి వారి విజయానికి కూడా తనవంతు సహకారం అందిస్తానని. వైసిపి అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన తెలిపారు.