ఆత్మకూరు టీవీ సెవెన్
రాష్ట్రంలో దొంగలుపడ్డారు...కాపాడుకుందాం
ప్రజలకు ఏం చేస్తాడో చెప్పలేక జగన్ చేతులెత్తేశారు.
కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్...వైసీపీ మేనిఫెస్టే ఫట్
మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న జగన్...మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు?
మద్యనిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్నావ్...ఇప్పుడెందుకు అడుగుతున్నావ్.?
నేను అభివృద్ధికి బ్రాండ్...జగన్ నేరాలు, ఘోరాలకు బ్రాండ్
బ్యాండేజ్ తీయకుండా డ్రామాలు చేద్దామనుకున్నాడు....ప్రజల హేళనతో తీసేశాడు
అధికారంలోకి వచ్చాక హోంగార్డులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం.
ఆత్మకూరు ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అంతర్ రాష్ట్ర దొంగలు పడ్డారని...అందరం కలిసి కాపాడుకుందామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఏం చేస్తాడో చెప్పలేక జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడని అన్నారు. నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో శనివారం ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘అత్యంత కీలకమైన ఎన్నికలు మన భవిష్యత్ ను మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు 54 సభల్లో పాల్గొన్నాను. ప్రతి సభలోను రాతి యుగం పోయి స్వర్ణయుగం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కూటమి వస్తే అభివృద్ధి జగన్ వస్తే అరాచకం. ఐదేళ్లు ప్రజలు ప్రశాంతంగా లేరు.ప్రజలు జీవితాలన్ని తారుమారయ్యాయి. సైకో జగన్, ఏ2 విజయ్ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల తప్ప మరెవ్వరూ బాగుపడలేదు. మన మేనిఫెస్టో సూపర్ సిక్స్. ఇంత కంటే నేను చెయ్యలేనని జగన్ చేతులెత్తేశాడు.
ఒక నాయకుడికి దక్షత ఉండాలి, సంపద సృష్టించాలి దానిని ప్రజలకు పంచాలి. కాని జగన్ రెడ్డి తెలుగు జాతికి ద్రోహం చేసిన వ్యక్తి. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలండర్ వచ్చిందా? డీఎస్సీ, పెట్టాడా? పరిశ్రమలు వచ్చాయా? కాని జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి.
సీపీఎస్ వారంలో రద్దు చేస్తానని మోసం చేశారు. ల్యాండ్, ఇసుక, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం కుంభకోణాలు జరుగుతున్నాయి. నేను ఏం తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారు. అంటే ప్రశ్నిస్తే దాడులు, అరెస్ట్ చేస్తారా జగన్ కి నాకు శత్రుత్వం ఏంటి వైఎస్, నేను ఒకప్పుడు మిత్రులం, రాజకీయంగా రెండు పార్టీల్లో పోరాడాం. వ్యక్తిగతంగా ఎప్పుడు పోలేదు. కాని ఇప్పుడు టీడీపీ అంటే పథకాలు కట్ చేసి భూములు లాక్కునే పరిస్థితికి దిగజార్చారు. నార్త్ కొరియాలో నవ్వినా, ఏడ్చినా, పండగ చేసుకున్నా కిమ్ కొడతాడు. అలాగే ఏపీలో జగన్ ఉన్నాడు అని చంద్రబాబు అన్నారు.రానున్న ఎన్నికల్లో కూటమిని అత్యదిక మెజార్టీతో గెలిపించాలన్నారు.