విజయవాడ టీవీ సెవెన్ న్యూస్
- నగరంలోని నోవాటెల్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా ఇటీవల నియమించింది. సోమవారం రాత్రి డిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రాకు నోవాటెల్ వద్ధ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ స్వాగతం పలికారు.