నాతవరం టీవీ సెవెన్ న్యూస్
అయ్యన్నపాత్రుడు ఏమీ అభివృద్ధి చేయలేదు పెట్ల ఉమా శంకర్ గణేష్
వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో జగన్ ఒక్కడే ఒక వైపు అని, మిగాతా పార్టీలంతా ఒక వైపు అని, ఈ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి. సుబ్బారెడ్డి అన్నారు. నాతవరంలో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు నాతవరం మెయిన్ రోడ్డు మీదుగా అనకాపల్లి ఎంపి అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ లు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ నియోజగవర్గంలో అంకంరెడ్డి జమీలు లేని లోటు. స్పష్టంగా ఉందన్నారు. 99.9 శాతం హామీలు అమలు చేసిన నాయకుడు మన జగన్ అన్నారు. ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించారన్నారు. అలాగే విద్య, వైద్యంను మరింత చేరువ చేశారన్నారు. ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ నాతవరం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేది అంకంరెడ్డి జమీలు అన్నారు.
కానీ ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను, ఎమ్మెల్యేగా గణేషు గెలిపించాలని కోరారు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అయ్యన్న చేసింది ఎమి లేదన్నారు. సీఎం రమేష్ వద్ద 20 కోట్లుకు కక్కుర్తి పడ్డా రు అని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ అయ్యన్న, విజయలను అల్లిపూడి పంపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, జెడ్పిటీసీ కాపారపు అప్పలనరన్న, ఎమ్ పి పి లక్ష్మణమూర్తి మండల పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ అప్పలరాజు, నాలుగు మండల నాయకులు పాల్గొన్నారు..