మాడుగుల టీవీ సెవెన్ న్యూస్
పైల ప్రసాద్కు మొండిచేయి చూపించిన అధిష్టానం...అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ సీటును పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయ ణమూర్తికి కేటాయించాలని తెలుగుదేశం నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం ఆయనకు ఫోన్ చేశారు. సత్వరమే ఎన్నికల దుష్ట ప్రచారం ప్రారంభించాలని ఆదేశించారు. వాస్తవానికి ఆయన నియోజకవర్గం పెందుర్తి. పొత్తులో భాగంగా అది జనసేనకు వెళ్లింది. ఆ పార్టీ తరపున పంచ కర్ల రమేశ్బాబు పోటీచేస్తున్నారు. దీనిపై బండారు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రని వార్తలు వచ్చాయి. అనకాపల్లి లోక్సభ పరిధిలోని మాడుగుల స్థానానికి తొలుత పైలా ప్రసాదరావును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే బండా రుకు ఇవ్వాలని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ టీడీపీ అధిష్ఠానాన్ని కోర డంతో ఆయనకే ఖరారు చేశారు. ప్రసాదరావుతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం...
నేడు ముకుందపురం నుంచి 'బండారు' భారీ ర్యాలీ
మాడుగుల అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండలంలోని ముకుంద పురం నుంచి మాడుగుల మోదకొండమ్మ ఆలయం వరకూ గురువారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న ర్యాలీకి తరలి రావాల్సిం దిగా వారు పిలుపునిచ్చారు.