ప్రచారంలో దూసుకుపోతున్న గణేష్

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్

మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రారంభించిన నర్సీపట్నం శాసనసభ్యులు ఉమా శంకర్ గణేష్

నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  పెట్ల ఉమా శంకర్ గణేష్ మున్సిపాలిటీలో బుధవారం ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక 23వ వార్డులో వైసీపీ నాయకులతో కలిసి  ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ


,

2014లో  ఆచరణ సాధ్యం కాని మోసపూరిత   వాగ్దానాలిచ్చి  చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఇంటింటికి త్రాగునీరు, తదితర హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  2019లో కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను  విడుదల చేసి 99 శాతం వాగ్దానాలు అమలు చేశారన్నారు. సంక్షేమ పథకాలే కాకుండా వందల కోట్ల రూపాయలతో నర్సీపట్నం నియోజకవర్గంలో   అనేక అభివృద్ధి కార్యక్రమాలు  అమలు చేశారన్నారు. నర్సీపట్నం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న  అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసామని, కొన్ని పూర్తి కావాల్సి ఉందన్నారు.


గత ఐదేళ్లలో  నర్సీపట్నం లో జరిగిన  అభివృద్ధిని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.