అందరికీ సంక్షేమం ఇచ్చాం మళ్లీ దీవించండి వైసీపీ అభ్యర్థి గణేష్

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


21 వ వార్డ్ ఇంటింటి ప్రచారంలో నర్సీపట్నం ఎమ్మెల్యే కట్ల ఉమాశంకర్ గణేష్ కు మహిళలు ఘన స్వాగతం పలికారు. 21వ వార్డులో ఆయన పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం లో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం ఎంతో ఆనందం గా ఉందన్నారు .జగనన్న సంక్షేమం ప్రతి ఒక్కరికి అందిందంటేనే ఓటు వెయ్యండి పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు .


ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక ప్రభుత్వ పథకం లబ్ధి పొందారని సంక్షేమానికి  పెద్దపీట వేశారని భవిష్యత్తులో మరల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మల్లీ సంక్షేమ పథకాలు మీ అందరికీ అందేటట్లుగా వార్డు కౌన్సిలర్ కర్రీ వినీల చైతన్య తో  కలిసి ప్రతి ఇంటికి వైసీపీ అభ్యర్థి గణేష్ వెళ్లారు.ప్రతి ఇంటి వద్ద మహిళలు పూలమాలతో సత్కరించి హారతులు ఇచ్చి దీవించారు. మీ చల్లని దీవెనలు తో మళ్లీ నన్ను గెలిపించండి అని గణేష్ కోరారు

. ఈ కార్యక్రమం లో వైసిపి నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ పార్టీ అధ్యక్షులు ఏకాశివ కర్రీ శ్రీనివాసరావు సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపత్రుడు డాక్టర్ లక్ష్మీకాంత్ డాక్టర్ రాజశేఖర్ ప్రచారంలో పాల్గొని వాటర్ ను ఉత్తేజపరిచారు