నర్సీపట్నం చేరుకున్న ఈవీఎం మిషన్లు

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 

 రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన అధికారులు


నర్సీపట్నంలో శనివారం అనకాపల్లి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మిషన్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి నర్సీపట్నం చేరుకున్నాయి.  ఆర్డీవో మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం రాజకీయ నాయకులు పోలీసుల భద్రత నడుమ స్థానిక అల్లూరి సీతారాముల డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూము ఏర్పాటు చేసి వాటిని భద్రపరిచారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్ మరియు ఆర్డీవో అధికారి జయరాం మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు రావడం జరిగిందన్నారు. ఈ ఈవీఎంలు 314 కౌంట్రోల్ యూనిట్,314 బ్యాలైటింగ్ యూనిట్లు 340 ఈవి ప్యాడ్స్, వచ్చాయని, శాసనసభకు సంబంధించిన ఈవీఎంలు రెండు రోజుల్లో రావడం జరుగుతుందన్నారు. ఇప్పుడు వచ్చిన

ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీల నా యకులు,పోలీసుల సమక్షంలో చింతపల్లి రోడ్డులో ఉన్న అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేసి వాటిలో భద్రపరచి సీలు వేయడం జరిగిందన్నారు.