నాతవరం టీవీ సెవెన్ న్యూస్
పెదజగ్గంపేట నాని బాబు ఆధ్వర్యంలో 60 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం లోకి చేరిక
నాతవరం మండలం పెద జగ్గంపేట గ్రామంలో ఎన్నికల శంఖారావం సభలో మాజీ మంత్రి అయ్యన్న సమక్షంలో నాని బాబు వర్గం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి 60 కుటుంబాలు చేరడంతో అయ్యన్న కండువా కప్పి వారందరినీ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాని బాబు మాట్లాడుతూ ఈ జగ్గంపేట గ్రామ ప్రజలు అయ్యన్నపాత్రుడికి ఎంతో రుణపడి ఉన్నారని ఆయన హయాంలోనే బీసీ కాలనీకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత అయ్యన్నపాత్రుడు దే అన్నారు. ఆజన్మాంతం ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారన్నారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది అన్నారు. అలాగే బిజెపి నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రం నాయుడు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం మోడీ గవర్నమెంట్ ఇస్తుందని అలాగే హౌసింగ్ కాలనీ ఇల్లు నిర్మాణాలకు 1,80,000 రూపాయలు కూడా బిజెపి ప్రభుత్వమే ఇస్తుందని ఎన్నో ఏళ్ల రామ మందిర నిర్మాణ కలను సాధ్యం చేసిన ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తానన్నది చేసిందా సన్న బియ్యం ఇస్తానన్నారు ఇచ్చారా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు .రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అలాగే కమలం గుర్తుపై ఓటేసి బిజెపి ఎంపీ అభ్యర్థి ఎం రమేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు
. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు బిసి సెల్ అధ్యక్షుడు పారుపల్లి రమణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండ్రు మరిడియ్య ఎస్బి పట్నం సర్పంచ్ లోకవరపు సతీష్ తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లోవ భాస్కర రావు,నాని బాబు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు