అనకాపల్లి టీవీ సెవెన్ న్యూస్
అక్రమ మద్యం సరఫరా, రవాణా అరికట్టేందుకు అనకాపల్లి జిల్లా సెబ్ మరియు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీసులు ఉమ్మడి కార్యాచరణతో దాడులు నిర్వహించాలి: సెబ్ జాయింట్ డైరెక్టర్ శ్రీ బి.విజయభాస్కర్......
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్త సమావేశం నిర్వహించిన జాయింట్ డైరెక్టర్ ఎస్ఈబి
అనకాపల్లి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీ బి.విజయభాస్కర్ వారి ఆధ్వర్యంలో “డిస్ట్రిక్ట్ లెవల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశానికి జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ శ్రీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ అక్రమ మద్యం పంపిణీ, అమ్మకాలు నిరోధించేందుకు రెండు శాఖలు ఉమ్మడి కార్యాచరణతో నిఘా పెట్టి, ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు రైడ్ లు చేయాలన్నారు. చట్ట వ్యతిరేకంగా ఇతర జిల్లా, రాష్ట్రాల నుండి వచ్చే మద్యంపై నిఘా ఉంచి దాడులు చేయాలన్నారు. మద్యం డిపో నుండి బార్లకు సరఫరా అయ్యే మద్యం నిల్వల వివరాలు సమాచారాన్ని ఇరు శాఖలు పంచుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అనకాపల్లి ఈ.ఎస్ జయ సింహ చౌదరి, ఏ.ఈ.ఎస్ డి.శైలజ రాణి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీదేవి తో పాటు సెబ్,ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.