ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ ఆస్తులు కోల్పోయే ప్రమాదముంది. తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం చిన గొలుగొండపేట రాజుపేట అగ్రహారం గ్రామాల్లో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెద గొలుగొండ పేట నుంచి చింతకాయల బాబిలు తెలుగుదేశంలోకి రావడం ఎంతో శుభ సూచకం అన్నారు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాలంలో మీ గ్రామానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసాం మాకు ఓటేయండి అని అడుగుతున్నాం మరి ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పి వైసిపి వారు ఓటు అడగాలని ఆయన సూచించారు .


గుంతల పడిన రోడ్లకు గుంతలు పూడ్చడానికి చేతకాలేదు కానీ విమర్శలు చేయడం చూస్తే చాలా విడ్డూరంగా ఉందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి మన ఆస్తులన్నీ తాకట్టుపెట్టే ప్రమాదం ఉందని ఇకనైనా ప్రజలు గమనించి మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అయ్యన్నను కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు నేతల విజయ్ కూండ్రపు అప్పలనాయుడు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.