వైసీపీ నుండి టిడిపిలోకి భారీ చేరికలు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్


నాతవరం మండలం వైబి పట్నం గ్రామంలో ఎన్నికల శంకరావం సభలో వైసిపి నుండి టిడిపిలోకి వార్డు మెంబర్ తో సహా 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా కూండ్రపు అప్పలనాయుడు మాట్లాడుతూ అరాచకాలు ఎక్కువైపోయాయని అందుకే తెలుగుదేశం లోకి వలసలు ప్రారంభమై అన్నారు.


గత ఐదు సంవత్సరాలు కాలంలో అభివృద్ధి శూన్యం అని అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. అలాగే తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూవైబి పట్నం గ్రామానికి సుమారుగా ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు చేశామని తాండవ ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తులకు కేవలం 7.50లక్షలు నిదులు తేలేని చేతకాని నాయకులు వచ్చి ఓట్లు అడిగే అర్హత ఉందా అన్నారు.ఇ ఐదు సంవత్సరాల కాలంలో అరాచకానికి పాల్పడి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులు గురి చేశారు వారందరి పైన కూడా చట్టం పరిధిలో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేముడు తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లొవ కూండ్రపు అప్పలనాయుడు, దాసు పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.