రోలుగుంట టివి సెవెన్ న్యూస్
కోటి రూపాయలు విలువచేసే 590 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న రోలుగుంట పోలీసులు.
రోలుగుంట పోలీసులకు రాబడిన సమాచారం మేరకు పెదపేట గ్రామం, గంగాలమ్మ దేవాలయం వెనుక సరుగుడు తోటలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు కొత్తకోట సిఐ ఎల్ .అప్పలనాయుడు, రోలుగుంట మరియు రావికమతం ఎస్సై లు ఎల్. సురేష్, జి.ధనుంజయ నాయుడు మరియు సిబ్బంది, మధ్యవర్తులు సమక్షంలో దాడి చేసి నిందితులైన కొదమ నాగరాజు, 26 సం.,వాల్మీకి కులం, వ్యవసాయం, ఎం.పెదపేట గ్రామం, ఎం.కే.పట్నం పంచాయతీ, రోలుగుంట మండలం.నంబరు రాజు, 30 సం. తండ్రి తాతాలు, యాదవ కులం, ప్రైవేట్ పశువులు డాక్టర్, ఆర్లి గ్రామం, కే.కోటపాడు మండలం.వేలంకాయల కాశీరాజు, 25 సం.తండ్రి తాతాలు,కూలి, వెలమకాయల గ్రామం,రోలుగుంట మండలం.అను ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లు మరియు బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయలు విలువచేసే 590 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ్ రవాణాకు పాల్పడుతున్న నిందితుల ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింకు సంబంధిత నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ తెలిపారు.
గంజాయిని స్వాధీనం చేసుకున్న రోలుగుంట, రావికమతం పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.