నిజం గెలవాలి కడప సభలో భువనేశ్వర్ కి జన నీరాజనం

 కడప టీవీ సెవెన్ న్యూస్


కడప 44వ వార్డులో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నారాభువనేశ్వరి మాట్లాడుతూ 

మండుటెండను సైతం లెక్కచేయని మీ అభిమానానికి నా నమస్కారాలు.చంద్రబాబు రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో మీకు బాగా తెలుసు.మరో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ ఐదేళ్లలో చాలా కోల్పోయారు.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు..పైగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.వైసీపీ రాక్షస పాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారింది.రాక్షస పాలనలో నేను ధైర్యంగా ఇలా మీ వద్దకు వచ్చానంటే మీరున్నారనే నమ్మకమే.గంజాయి, ఇసుక మాఫియా, భూకబ్జాలు, కల్తీ మద్యంలో వైసీపీ ప్రభుత్వం ఏపీని దేశంలో ముందు వరుసలో నిలబెట్టింది.వైసీపీ చేసే ప్రతి తప్పును చంద్రబాబుపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.నేడు కొత్తగా పెన్షన్ల విషయాన్ని కుట్రపూరితంగా చంద్రబాబుకు ఆపాదిస్తున్నారు.

వృద్ధులను మంచాలపై ఎండలో తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిన్న బలి తీసుకున్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం తపించిన చంద్రబాబు పేదవాళ్లకు పెన్షన్లను ఎలా అడ్డుకుంటారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర సస్యశ్యామలంగా ఉంటుంది.రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించాలి, టీడీపీ జెండాను ఎగరేయడానికి కృషి చేయాలి.