అనంతపురం టీవీ సెవెన్ న్యూస్
అనంతపురం రేంజ్ డి.ఐ.జి గారి ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసుల కవాతు
తాడిపత్రిలో కొనసాగుతోన్న ప్రశాంత పరిస్థితులు... భారీగా పోలీసు బలగాల మొహరింపు
పట్టణంలో అమలవుతోన్న 144 సెక్షన్ ... ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం, చట్టవిరుద్ధం
అల్లర్లు, గొడవలకు దిగితే చట్టం గట్టిగా బుద్ధి చెబుతుంది
కళ్యాణదుర్గం, అనంతపురం రూరల్ డీఎస్పీలు
అనంతపురం రేంజ్ డి.ఐ.జి డాక్టర్ వి.షిమోషి IPS గారి ఆదేశాలతో ఈరోజు తాడిపత్రి పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డిల నేతృత్వంలో ఎపీఎస్పీ పోలీసు బలగాలు కవాతులో పాల్గొన్నాయి. తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాల రోడ్డు వద్ద ప్రారంభమైన ఈ కవాతు అశోక్ పిల్లర్, బండమసీద్, వైఎస్.ఆర్ కూడళి, పుట్లురు రోడ్డు, యల్లనూరు రోడ్డు కూడళ్లు మరియు ఆర్టీసీ బస్టాండు సర్కిల్ వరకు కొనసాగింది. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని డీఎస్పీలు విజ్ఞప్తి చేశారు. అల్లర్లు, గొడవల జోలికెళితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని... ఇదే ప్రశాంతతసను కొనసాగించేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని... ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం చట్ట విరుద్ధమన్నారు. 144 సెక్షన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.