చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


రౌడీ షీటర్లకు  పట్టణ పోలీసుల కౌన్సిలింగ్ 

నర్సీపట్నం  లో శాంతి భద్రతలకు  విఘాతం కలిగించే విధంగా గొడవలు, అల్లర్లలో  పాల్గొన్నట్లయితే  కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం ఎస్ డి పి ఓ జి ఆర్ వి మోహన్, పట్టణ సీఐ  కాంతి కుమార్  హెచ్చరించారు. శనివారం సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో  పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు పూర్తయ్యే వరకు  మరింత జాగ్రత్తగా ఉండాలని వారిని హెచ్చరించారు. చట్టాన్ని వ్యతిరేకించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు


. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు  సుధాకర్, ఉమామహేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.