నాతవరం మండలంలో వైసీపీకి భారీ షాక్

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం ఎంబి పట్నం పంచాయతీ నుంచి సుమారుగా 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి అయ్యన్న తన నివాసంలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మేముఅందరము ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి ఉన్నామని చిన్నచిన్న విభేదాలతో దూరం అయ్యామని మళ్లీ మనందరం కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.


ఇలాగే అందరం ఒకే కుటుంబంలో ఉంటూ ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా నా కుటుంబం మీ కండగా ఉంటుందని ఏ సమయంలో వచ్చిన నా ఇంటి గేట్లు తెరిసే ఉంటాయన్నారు .అందరూ కలిసి కష్టపడి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అప్పిరెడ్డి మాణిక్యం పల్లి బాపనాయుడు  తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు