పారిశూద్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలి

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


ఎంపీడీవో కే.రాంబాబు.....

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపధ్యంలో పారిశుద్య నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టాలని నాతవరం మండల  మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె.రాంబాబు ఆదేశించారు.మంగళవారం మండల కేంద్రమైన నాతవరంలో గల మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్నందువల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రతిరోజు నిర్వహించి వీధులను శుభ్రంగా ఉంచాలన్నారు. డ్రైనేజీలో ఉన్న మురుగును తక్షణమే తొలగించాలని సూచించారు.మంచినీటి ట్యాంకులకు క్లోరినేషన్ చేయాలని,కొళాయిలు వద్ద శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు మంచినీళ్లు వేడి చేసి తాగాలని సూచించారు. కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని అన్నారు.ఈ సమావేశంలో ఈవోపీఆర్డి నరసింహమూర్తి,పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.