నాతవరంలో కార్డెన్ సెర్చ్

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్


 సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్..

నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజనల్ అధికారి మోహన్ 

సోమవారం ఉదయం నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మోహన్ ఆధ్వర్యంలో నాతవరం మండల కేంద్రంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతి వీధిని ప్రతి ఇంటిని తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేని సుమారు 60 ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు


. డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పిడి యాక్ట్, రౌడీ షీటర్ల గాను  గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీస్ కార్యకలాపాలకు సహకరించాలని, అన్నారు. సీజ్ చేసిన వాహనాలకు సరైన పత్రాలు చూపించినచో విడుదల చేస్తామని అన్నారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ బి .హరి, టౌన్ సీఐ, క్రాంతి కుమార్, స్థానిక ఎస్సై రామారావు, రూరల్ ఎస్సైలు కృష్ణారావు ,రామకృష్ణ, ఉపేంద్ర, ఉమామహేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.