నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలం సరుగుడు పంచాయతీలో సుమారుగా 110 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం లోకి పట్టెం రాజుబాబు ఆధ్వర్యంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సరుగుడు ఎన్నికల ప్రచారంలో వారందరినీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరుగుడు పంచాయతీకి సుమారుగా 18 కోట్ల రూపాయలతో రోడ్లు వేసామని అలాగే 15 సోలార్ వాటర్ ట్యాంకులు నిర్మించి మంచినీరు అందించమని దాదాపుగా సరుగుడు చుట్టుపక్కల 16 చిన్న చిన్న గ్రామాలకు కూడా రహదారి లేక ఇబ్బందులు పడుతుంటే కొండని తొలిచి కూడా రోడ్డు నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని ఆయన తెలిపారు.ఎమ్మెల్యే మొట్టమొదటి శంకుస్థాపన చేసిన సచివాలయం ఈరోజుకి కూడా నిర్మాణాలు పూర్తి కాకపోవడం సచివాలయానికి వచ్చిన సిమెంట్ 2000 బస్తాలు వైసీపీ నాయకులు వాడేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఇకనైనా రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను సైకిల్ గుర్తుపై ఓటేసి అయ్యన్నపాత్రుడు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీ లు సింగంపల్లి సన్యాసిదేముడు పారుపల్లి కొండబాబు నేతలు విజయ్ కుమార్ చిన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు