సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తున్నామని మండల వ్యవసాయాధికారి శైలజ తెలిపారు. మండలానికి తొలి విడతగా జీలుగ రూ.8.8క్వింటాళ్లు, పిల్లి పెసర 1.5 క్వింటాళ్లు, జనుము 1.4 క్వింటాళ్లు వచ్చాయన్నారు. ఆయా విత్తనాల కోసం ముందుగా ఆన్ లైన్లో నమోదు చేసుకున్న రైతులకు ఇస్తామన్నారు. అదే విధంగా ఖరీప్ సీజన్లో వరి విత్తనాలు రైతుల అభీష్టం మేరకే సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు.