నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
వస్తున్నా మీకోసం అయ్యన్న పాదయాత్రలో వైసిపి ముఖ్య నాయకులు శెట్టి మోహన్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
అయ్యన్న పాదయాత్ర బలిఘట్టం మరిడమ్మ గుడి నుండి పాత బైపురెడ్డిపాలెం వరకు జనసంద్రంతో బలిఘట్టం లో వైసీపీ ముఖ్య నాయకులు అయినా శెట్టి మోహన్, గవిరెడ్డి బెన్నయ్య నాయుడు, అయ్యన్న పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో భాగంగా అయ్యన్న మాట్లాడుతూ మరో 9 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వబోతుందని, ఈ వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని, ఈ చేతకాని ముఖ్యమంత్రిని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. తెలుగుదేశం హయాంలో ప్రజలు ఎంతో సురక్షితంగా ఉంటూ, అన్ని వర్గాల వారికి కావలసిన ఉపాధి అందుబాటులో ఉంచారు అని, రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయిన కానీ ప్రజలకు రావాల్సిన సంక్షేమం, యువతకు కావలసిన ఉద్యోగాలు, రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి ఎక్కడా కూడా తగ్గకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబుది అని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొత్త రాజధాని నిర్మించి, కొత్త పరిశ్రమలు తీసుకువచ్చిన, వాటికి తగిన ప్రణాళికలు చేసి రాష్ట్రాన్ని అప్పుల అవ్వకుండా చర్యలు తీసుకున్నారని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ఒక్క అభివృద్ధి జరగకపోగ, రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందని తెలియజేశారు. మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఇక ఉద్యోగాలు ఉండవని, కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రతి ఒక్కరి భూములు కూడా లాగేసుకుంటారని తెలియజేశారు. అలా జరగకూడదు అంటే మే 13 న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు.
ఇప్పటివరకు నర్సీపట్నంలో జరిగిన అభివృద్ధి తన హయాంలో జరిగిందని, ఈ వైసీపీ ప్రభుత్వంలో చెప్పుకోడానికి కూడా ఒక్క పని కూడా చేయలేదు అని దీనితో పాటుగా నర్సీపట్నం నుండి గంజాయి అడ్డాగా మారింది అనే చెడ్డ పేరుని కూడా తీసుకువచ్చారు. మరల మన నర్సీపట్నంకు పట్టిన పీడ తొలగించడానికి ప్రజలందరికీ ఒక అవకాశం వచ్చిందని, నర్సీపట్నం కు తను చేయాల్సిన అభివృద్ధి ఇంకా మిగిలింది. అని తెలియజేస్తూ రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు
. పాదయాత్రలో భాగంగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు జనసేన మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.