అల్లూరి సీతారామరాజు కి ఘన నివాళి

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


 స్వతంత్ర సమరయోధులు విప్లవ వీరులు  రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా నర్సీపట్నంలో ఆయన విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎ.రాజులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

      ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే భారత దేశ స్వాతంత్ర్యం కోసం మన మన్యం ప్రాంతంలో ఆదివాసీలను తమ సైన్యం గా తయారు చేసుకుని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప ధైర్యసాహసాలు కలిగిన యోధుడు అని కొనియాడారు .సమసమాజం స్థాపించాలని తపన పడిన గొప్ప త్యాగ జీవి అల్లూరి అని తెలిపారు.కరుడు గట్టిన సామ్రాజ్య వాదులైన బ్రిటిష్ సైన్యం అల్లూరిని ఇరవై ఏడు సంవత్సరాల వయసులో పట్టుకుని కాల్చి చంపడం జరిగింద వీరుడు మరణించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన కు ఘణనివాళులు అర్పిస్తున్నాము, ఆయన ఆశయాలు సాధిస్తామని ప్రతినబూనుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగరాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు