హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్


 10 లక్షలు జరిమానా

నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పైల రమణకు హత్య కేసులో విశాఖపట్నం పి డి జె జిల్లా కోర్టు శిక్ష కరారు చేసింది.  అదే గ్రామానికి చెందిన సుర్ల వెంకటరమణ శరభవరం గ్రామంలోని సంతలో సరుకులు కొంటుండగా పైల రమణకు సుర్ల వెంకటరమణకు గతంలో భూతగాధాల కారణంగా అదే అదునుగా భావించిన రమణ 2014 సంవత్సరంలో రాయితో కొట్టి హత్య చేసినట్టు వెంకటరమణ తల్లి ఫిర్యాదు మేరకు నాతవరం పోలీస్ వారు దర్యాప్తు జరిపి ఫైల రమణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా పైల రమణ కోర్టు నిర్ధారణ చేసి పది సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షలు జరిమానా విధించడం జరిగింది. ముద్దాయికి జైలు శిక్ష పడేవిధంగా దర్యాప్తు జరిపిన పోలీసువారికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు.