అనంతపురం టీవీ సెవెన్ న్యూస్
అనంతపురం జిల్లా కనేకల్ మం.
తుంబిగనూరులో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
తాగునీటి శుద్ధజల ట్యాంకులో నిన్న రాత్రి పురుగు
మందు కలిపి విషప్రయోగానికి కుట్ర చేశారు.
ఉదయాన్నే ట్యాంకులో డబ్బా గుర్తించి, ఎవరూ
ఆ నీళ్లు తాగకపోవడంతో ముప్పు తప్పింది. టీడీపీ
గెలిచిందన్న అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని
గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆ గ్రామానికి
చేరుకుని పరిశీలిస్తున్నారు.