అనకాపల్లి టీవీ సెవెన్ న్యూస్
జిల్లా అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషించాలి.
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అధికారులు ప్రజలకు మేలు జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో
రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరచి ప్రజలకు మంచి పరిపాలనను ఈ ప్రభుత్వం అందించడం జరుగుతుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం ఉదయం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అదృశ్యం కేసులపై
సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. గ్రామాలలో సమస్యలు ముఖ్యంగా
పంచాయతీరాజ్ , రోడ్లు మరియు భవనాలు, ఇరిగేషన్ శాఖలో ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించవలసినదిగా మంత్రి కోరారు. ముందుగా రాష్ట్ర హోం శాఖ మంత్రిగా నియమితులైన వంగలపూడి అనితను జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జిల్లా ఎస్పీ కేవీ మురళి కృష్ణ, జిల్లా అధికారులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు