నాతవరం టీవీ సెవెన్ న్యూస్
ఇద్దరు డాక్టర్లున్నా హాస్పటల్లో ఒక్కరు కూడా లేని వైనం
అదే బాటలో ల్యాబ్ టెక్నీషియన్ డుమ్మా
డాక్టర్లు లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్లు
స్టాఫ్ నర్స్ తోనే వైద్యం చేస్తు నెట్టుకొస్తున్న సిబ్బంది
నాతవరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సుమారుగా ఇటు ఏజెన్సీ సరుగుడు ప్రాంతం నుంచి ఏటివతల గ్రామాలకు ఇదొక్కటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడం పేద ప్రజలకు ఏదైనా ఆకస్మికంగా ఆరోగ్యం క్షీణిస్తే నాతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు లేకపోవడం తో పేషెంట్ ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే సుమారుగా 25 కిలోమీటర్ల దూరం ఉండటంతో అదృష్టవశాత్తు రోగి బ్రతికితే బ్రతకడం లేదంటే కాటికే .ఇటీవల కాలంలో నాతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధునాతన భవనం నిర్మించి ప్రజలకు వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది వల్ల ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా అటు పేషెంట్లు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఒక స్టాఫ్ నర్స్ తోనే వైద్య సేవలు నెట్టుకొస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గాని డాక్టర్స్ కానీ మిగతా సిబ్బంది చాలావరకు సోమవారం డ్యూటీలో లేకపోవడం తో అక్కడున్న సిబ్బందిని ప్రశ్నిస్తే పబ్లిక్ హాలిడేలో డాక్టర్లు గాని ల్యాబ్ టెక్నీషియన్ గాని రావడంలేదని తెలియజేశారు .ఇకనైనా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించి అందుబాటులో వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.