నాతవరం టీవీ సెవెన్ న్యూస్
ఘనంగా వీడ్కోలు పలికిన నాతవరం ఎస్సై రామారావు
నాతవరం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ దొంతుల బంగారురాజు 62 వసంతాలు పూర్తిచేసుకుని పదవీ విరమణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాతవరం ఎస్సై రామారావు పదవీ విరమణ సభను ఘనంగా నిర్వహించడంతోపాటు బంగార్రాజు ఉద్యోగ లో బాధ్యతగా మెలగడం పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్న కూడా విధుల్లో ఎటువంటి అలసత్వం వహించకుండా ఎంతో బాగా పనిచేసారు అని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సమర్థంగా నేను పూర్తి చేస్తానని చెప్పి
అదే విధంగా పూర్తి చేసిన ఏఎస్ఐ పదవి విరమణ చేయడం ఎంతో బాధగా ఉందని ఆయన 62 సంవత్సరాలు ఎటువంటి మచ్చ లెకుండా ఒక నిజాయితీపరుడుగా ఉద్యోగ విరమణ చేయడం ఎంతో కత్తి మీద సాము అని ఆయన తెలిపారు అలాగే ఆ భగవంతుడు ఆయురారోగ్య ం కల్పించి తన శేష జీవితాన్ని మంచిగా ఉండాలని కోరుతున్నాను అన్నారు .నర్సీపట్నం రూరల్ సీఐ బి హరి మాట్లాడుతూ తన చివరి డ్యూటీ రోజు వరకు కూడా అంకితభావం తో పనిచేసిన వ్యక్తి బంగారు రాజు అని ఆయనకు గుర్తింపుగా ఉత్తమ పోలీస్ అవార్డుకు ఎంపిక చేసి పంపడం జరిగిందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో గొలుగొండ ఎస్సై కృష్ణారావు నాతవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది బంగారు రాజు బంధువులు తదితరులు పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు.