గొలుగోండ టివి సెవెన్ న్యూస్
జనసేన గొలుగొండ మండల నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి విశాఖ జిల్లా కార్యవర్గం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో గల జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలిసినటువంటి అనకాపల్లి జిల్లా జనసేన కార్యవర్గం ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం 10 సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టానికి ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యంతో గెలుపొందినటువంటి జనసేన తరపున పోటీ చేసినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీల కు గొలుగొండ మండలం తరుపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గెలుపొందినటువంటి అభ్యర్థులను ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులలో మిగతా
నియోజకవర్గాలతో పాటుగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతం చేసే దిశగా అందరూ కష్టపడదామని ఏ కార్యకర్త కష్టం వచ్చినా కలిసికట్టుగా ఆదుకుందామని గ్రామ గ్రామాన జనసేన ప్రాతినిధ్యం ఉండేలా కృషి చేద్దామని ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగిందని తెలియజేశారు అంతేకాకుండా ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా మా నర్సీపట్నం నియోజకవర్గంలో గెలుపొందినటువంటి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి అనకాపల్లి ఎంపీగా
గెలుపొందినటువంటి సీఎం రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అనకాపల్లి జిల్లా కార్యవర్గం మరియు గొలుగొండ మండల కార్యవర్గం తోపాటు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు