నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
మన్యం గుండెల్లో విప్లవ జ్యోతులు రగిలించి, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన,తెలుగుజాతి గర్వించదగ్గ ధీరుడు,స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127 జయంతి సందర్భంగా కృష్ణా దేవి పేట లో సీతారామరాజు సమాధుల వద్ద ఘన ంగా నివాళులు అర్పించారు.బ్రిటీష్ బంధనాల నుంచి భారతమాత విముక్తి కోసం భారత బానిస సంకెళ్ళు తెంచేందుకు భావి తరాలకు స్వేచ్ఛను అందించేందుకు అలుపెరగని పోరాటం చేసి అమరుడైన అగ్గిపిడుగు అల్లూరి సీతారామ రాజు గొప్పతనాన్ని, చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలి అని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి విధి అని భావించాలి అని ఎక్కడైతే పీడన, దోపిడీ ఉంటే అక్కడ మహామహులు ఉద్భవించి ఉద్యమిస్తారు వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే.వీరులకు పుట్టుకేగాని మరణం ఉండదు అల్లూరి చైతన్యం,రగిల్చిన విప్లవాగ్ని నిత్యం జ్వలిస్తూనే ఉంటుంది
.అటువంటి విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తు, అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, ధీరత్వం, మృత్యువుకు వెరవని ధైర్యం, జ్ఞాన-ఆధ్యాత్మిక సంపద గురించి నేటి తరానికి ముఖ్యంగా యువతరంకు తెలియజేసేలా చాటిచెబుదాం.స్వతంత్ర పోరాటంలో తెలుగు జాతిని జాగృతం చేసిన మహనీయుడు జయంతోత్సవం సందర్బంగా వారి సేవను, వీర పోరాటాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకారుల అయ్యన్నపాత్రుడు మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి జాయింట్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.