కాలినడకన తిరుపతి

  నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


శ్రీ శివ శక్తి క్షేత్ర ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావాలని కోరుకుంటూ చిక్కుడుపాలెం గ్రామం నుండి  తిరుమలకు కాలినడకన బయలుదేరుతున్నామని శ్రీ శివశక్తి క్షేత్ర ఆలయ ధర్మకర్త కేఎస్ఆర్ శర్మ అన్నారు


.అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో గల ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయమైన శ్రీ శివశక్తి క్షేత్రం నుండి బుధవారం తిరుమలకు ఆయన కాలినడకన బయలుదేరారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శర్మ మాట్లాడుతూ  గుడి నిర్మాణ పనులకు ఆటంకం కలిగినప్పుడు, విఘ్నాలు కలిగినప్పుడు, అనుకున్న సంకల్పం నెరవేరనప్పుడు  కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా పనులు పూర్తవుతాయనే విశ్వాసం ఉందని ఆయన గతంలో శివాలయం పనులు ఆటంకం కలిగినప్పుడు కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, వెంటనే ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరగడం జరిగిందని  చిక్కుడు పాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివశక్తి క్షేత్రం నుండి గతంలో రెండుసార్లు కాలినడకన తిరుమలకు వెళ్లడం జరిగిందని ఇది మూడోసారి అనిచిక్కుడు పాలెం శ్రీ శివశక్తి క్షేత్రం నుండి తిరుమలకు సుమారు 700 కిలోమీటర్లు, కాలినడకకు  24 రోజులు పడుతుందని ఆయన తెలిపారు.నా ఈ ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు కలగకుండా భక్తులందరూ ఆశీస్సులు తమపై ఉండాలని ఆయన కోరారు.