నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని మాకవరపాలెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపిఎస్.,
ఫిర్యాదుల పట్ల సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు
జిల్లా ఎస్పి శ్రీమతి దీపిక ఐపీఎస్.
జిల్లా ఎస్పి శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్., బాధ్యతలు చేపట్టిన తరువాత నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని మాకవరపాలెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టేషన్ రికార్డ్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి. తరుచు రిపోర్ట్ అవుతున్న నేరాలు గురించి ఆరా తీశారు. నేర చరిత్ర మరియు చెడునడత కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారికి కౌన్సిలింగ్ చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.ఆ గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసు కోవాలన్నారు.స్టేషన్లో రిసెప్షన్ పుస్తకం తప్పకుండా మెయింటైన్ చేయాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తూ నేర నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పి శ్రీ ఎస్.అప్పలరాజు,మాకవరపాలెం ఎస్సై రామకృష్ణారావు, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి జిల్లా ఎస్పీ శ్రీమతి దీపిక ఐపీఎస్., వివరించారు.