బిజెపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి హాజరైననర్సీపట్నం కన్వీనర్ యర్రం నాయుడు

 రాజమండ్రి టీవీ సెవెన్ న్యూస్ 


 బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరైన నర్సీపట్నం బీజేపీ ముఖ్య నాయకులు: 

 రాజమండ్రి లో సోమవారం ఎంతో వైభవముగా జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం కి రాష్ట్ర నాయకత్వం ఆహ్వానం మేరకు నర్సీపట్నం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ తమరాన యర్రం నాయుడు  ఆధ్వర్యంలో అసెంబ్లీ కో కన్వీనర్ వెలగా జగన్నాథ్, నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు పారిపిల్లి శ్రీనివాస్, నర్సీపట్నం రూరల్ అధ్యక్షులు బోలేం శివ, మాకవరపాలెం అధ్యక్షులు మర్రి నాయుడు, నాతవరం అధ్యక్షులు చుక్కల రాంబాబు, గొలుగొండ అధ్యక్షులు చందక గౌరినాయుడు మరియు జిల్లా సీనియర్ నాయకులు కొట్ని శ్రీనివాస్  పాల్గొన్నారు.


ఈ సందర్బంగా కన్వీనర్ యర్రం నాయుడు  మాట్లాడుతూ ఎన్నికల తరువాత మొదటి సారిగా జరుగుతున్న ఈ రాష్ర్ట  సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందముగా ఉందని అదేవిధముగా ఈ సమావేశం మా అందరిలోనూ ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని తెలియచేసారు. రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం మేరకు బీజేపీ పార్టీని ప్రతీ గ్రామానికి, ప్రతి గడపకు తీసుకుపోతామని అన్నారు.