నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
పెన్షన్ పంపిణి సమర్థవంతంగా నిర్వహించాలి
స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఒక్కరోజు ముందే రాష్ట్రమంతా పెన్షన్ పండుగ
తెల్లవారి ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలి
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణి కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు గ్రామాలలో, పట్టణాలలో పాల్గొని, ఒక్కరోజులో పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణి నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో, ఆ రోజు కాకుండా, ఆగస్టు 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో సమన్వయం చేసుకొని మండల నాయకులు, గ్రామనాయకులు పాల్గొని విజయవంతం చెయ్యాలని అయ్యన్న కోరారు.