గొలుగొండ టీవీ సెవెన్ న్యూస్
15 ఫైనాన్స్ నిధులు విడుదలైన రెండు రోజులకే డ్రా చేసిన వైనం ..!
చీడి గుమ్మల సచివాలయానికి ప్రహరీ గోడ నిర్మించిన రెండు రోజులకే కూలిపోయిన దానికి బిల్లు చెల్లించిన అధికారులు.
పప్పు శెట్టిపాలెం పంచాయతీకి సుమారుగా మూడు లక్షల వరకు ఖర్చు చేసిన సచివాలయం హాల్లో ఊడిపోయిన టైల్స్ కూడా రిపేరు చేయించలేదంటే మరి నిధులు ఎక్కడ ఖర్చు చేశారు..?
వంద రూపాయల బలుపు 200 లకు కొన్నట్టు చూపిస్తుంటే ఆడిట్ అధికారులు ఎందుకు నోరు మెదపలేదు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం లొ15 ఫైనాన్స్ నిధులు సుమారు గా1.34 కోట్లు పంచాయతీ లకు విడుదల చేశారు. విడుదల అయిన రెండు రోజులకి పంచాయతీ సెక్రెటరీ నిధులు ఖాళీ చేశారు. నిధులు ఎక్కువగా శానిటేషన్ ఖర్చులు చూపించారు కానీ గ్రామాల్లో అయితే శానిటేషన్ మచ్చుకైనా కనిపించడం లేదు కొన్ని గ్రామాల్లో అయితే దోమల వల్ల జ్వరాల బారిన పడుతున్నారు.
ఇటీవల కాలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా దోమతెరలు పంపిణీ చేయాలి అని ప్రజాప్రతినిధులు విన్నవించుకున్నారు అంటే శానిటేషన్ ఏ స్థాయిలో చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ప్రతి నెల బ్లీచింగ్ ఖర్చు చూపిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం బ్లీచింగ్ బదులు పౌడర్ జల్లి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో వీధి దీపాలు కోసం బల్బులు వంద రూపాయలకు కొని రెండు వందలు బిల్లులు చూపిస్తుంటే ఆడిట్ అధికారులు అభ్యంతరం చెప్పకపోవడం ఏ స్థాయిలో పై స్థాయి అధికారులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు ఇటే అర్థమవుతుంది. పాత బల్బులనే రిపేరు చేసి కొత్తగా బిల్లులు మార్చుకుంటున్నారు. వివిధ పంచాయతీలలో లక్షల్లో ఖర్చు చేసిన మౌలిక వసతులు గాని త్రాగునీటి సమస్యలు గాని అలాగే తిష్ట వేసి కూర్చుంటున్నాయి. జల జీవన్ మిషన్లో వేస్తున్న కుళాయిలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఇలా పంచాయతీలో అడుగడుగునా అవినీతి జరుగుతుంటే జిల్లాస్థాయి అధికారులకు ముడుపులు సెక్రటరీలు ఇవ్వడం వల్లే అధికారులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఇప్పటివరకు జరిగిన నిధులు ఖర్చుపై సమగ్ర విచారణ చెసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు ప్రజలు కోరుకుంటున్నారు.