నాతవరం టీవీ సెవెన్ న్యూస్
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 68వ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం బీసీ కాలనీలో గల బాలసదనం విద్యార్థినులకు నూతన రెడీమేడ్ బట్టలు, స్వీట్స్ అందజేశారు. అయ్యన్నపాత్రుడు చిన్న కోడలు చింతకాయల దివ్య రాజేష్, మరియు కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా దివ్య రాజేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలసదనం విద్యార్థినిలతో పంచుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతీ సంవత్సరం అయ్యన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగేదని, ఈసారి విజయవాడ తుఫాను విపత్తు తో వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అయ్యన్నపాత్రుడు గారు తన ఒక నెల జీతం తుఫాన్ బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగింది అని ఆమె పేర్కొన్నారు. ఈరోజు ఎటువంటి కేకులు కట్ చేయడం గాని, అభిమానులు వేడుకలు నిర్వహించడం గాని ఎక్కడా చేయలేదని, స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రమే చేశారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాబాల శ్రీను, ఫోటోలు శ్రీను, రుత్తల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.