నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలం లో మంగళవారం జరిగిన మండల మహిళ సంఘం ఎన్నికల్లో కోరుబల్లి మణి ని ఏకగ్రీవంగా 31 పంచాయతీల గ్రామైక్య సంఘం అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత చంద్రబాబు నాయుడు ముందుచూపుతో మహిళల అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి స్వయం శక్తితో మహిళ లను ముందుకు తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో పనిచేసే ఈ మహిళా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని ఇప్పుడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన మణి కూడా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు .
మహిళా సమాఖ్య సెక్రటరీగా రాకెట్ దేవి కుమారుని కోశాధికారిగా అప్పన్న వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణమాజీ ఎంపీపీలు సింగంపల్లి సన్యాసి దేముడు, నేతల విజయ్ కుమార్, పార్లమెంటు జనరల్ సెక్రటరీ కొండ్రు మరిణియ్య, మండల యస్.సి సెల్ అధ్యక్షుడు బంగారు సూరిబాబు,మండల మహిళా అధ్యక్షురాలు ఇనపసప్పల సత్యవతి, సర్పంచులు లాలం రమణ, లోకవరపు సతీష్, మాజీ ఎంపీటీసీలు అపిరెడ్డి మాణిక్యం, కాసుపు నూకరాజు,పల్లి బాపన్నాయుడు, యర్రా కాశీ,మండల ఐ.టిడిపి ఇన్ ఛార్జ్ శెట్టి గోపి,మండల తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లోవ,నాతవరం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ శెట్టి నానాజీ, సీనియర్ నాయకులు వనిమిన సూర్యారావు,పినిరెడ్డి పండు, చింతకాయల శ్రీను,సామర్ల రామారావు,వివిధ పంచాయతీల నుండి మహీళ కార్యకర్తలు,గ్రామ పార్టీ ప్రెసిడెంట్ లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.