నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు చొరవతో
నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజీలో ఉన్న వ్యాయమశాల పరికరాలు మరమ్మత్తు చేయబడ్డాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన వ్యక్తిగత నిధులతో ఆ వ్యాయమశాలను పునరుద్ధరించారు. 2018లో కాలేజీ విద్యార్థులు మరియు బయట యువకుల కోసం, సుమారు పది లక్షల రూపాయలతో జిమ్ పరికరాలను అయ్యన్న ఏర్పాటు చేయించారు అయితే, సరైన నిర్వహణ లేక, ఆ పరికరాలు నిరూపయోగంగా మారాయి.
సమీప కాలంలో డిగ్రీ కాలేజీని సందర్శించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, నిరూపయోగంగా ఉన్న వ్యాయమశాల పరికరాలను చూసి, తక్షణమే మరమ్మత్తు చేపట్టాలని నిర్ణయించారు. వారం రోజుల్లోనే అన్ని పరికరాలను సరిచేసి, విద్యార్థులు మరియు యువకులు వాడుకునే విధంగా సిద్ధం చేయించారు.
ఈ చర్య వల్ల స్థానిక యువతకు మరియు విద్యార్థులకు మళ్ళీ వ్యాయమం చేసేందుకు సదుపాయం లభించింది.