నాతవరం టీవీ సెవెన్ న్యూస్
ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ బిల్లు త్వరలో చెల్లిస్తాం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ
గత ప్రభుత్వంలో నాయకులు అభివృద్ధి చెందారు కానీ గ్రామాలు అభివృద్ధి చెందలేదు మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేముడు
నాతవరం మండలం చిన గొలుగొండపేట పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో రోడ్లకు మరమ్మతులు కూడా చెయ్యలేని దద్దమ్మ ప్రభుత్వం అని ఆనాటి వైసిపి నాయకుల పాపాలే ఇప్పుడు ప్రజల పాలిట శాపాలుగా మారాయని పెద్దవా చేశారు .స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి న 100 రోజుల్లోనే సుమారుగా 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
వెదురుపల్లి నుండి గోలుగోండ పేట రోడ్డు 68 లక్షలు ,మాసయ్య పేట నుండి కోటనందూరు రోడ్డుకు కోటి 48 లక్షలు ,ఆర్ఎంబి రోడ్ నుంచి ఆర్ పి అగ్రహారంకు 73 లక్షల ,తాళ్లపాలెం నుండి వడపర్తికి కోటి 48 లక్షలు చెర్లో పాలెం కు 68 లక్షలు సీసీ డ్రైన్ కి 13 కోట్లు నిధులు మంజూరు చేయించారని త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన ఇళ్లకు గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వలన మళ్లీ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం జరుగుతుందని మండలంలోని వివిధ గ్రామాల నాయకులు ఎన్టీఆర్ స్కీం కింద నిర్మించిన లబ్ధిదారులను వెరిఫై చేసి వారికి బిల్లులు చెల్లించే విధంగా అందరూ పనిచేయాలని ఆయన తెలిపారు.
మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు మాట్లాడుతూ గత పాలకులు వారి స్వలాభం కోసం వారి స్వార్థం కోసం చూసుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయలేదన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కూడా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, పారుపల్లి చినబాబు, మిరపల దొరబాబు, పండు, శ్రీనివాస్ రావు ఐటీడీపీ శెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు